Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:18 PM

గ్రామీణ బాలిక నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పావని ప్రయాణం

09-04-2026 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలంలోని కొండాపూర్ తాండకు చెందిన నందు సింగ్ ఎక్సైజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా, వారి కుమార్తె రాథోడ్ పావని ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇన్‌కమ్ ట్యాక్స్ సూపరింటెండెంట్ ఉద్యోగాన్ని పొందింది. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన పావని నారాయణఖేడ్ పట్టణంలోని విజ్ఞాన్ టాలెంట్ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివి, అనంతరం సంగారెడ్డిలోని సెంట్ జోన్ పాఠశాలలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి తరగతిలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ అనంతరం ఎంసెట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఎన్ఐటి విద్యాసంస్థలో సీటు పొందిన ఆమె అక్కడ ఉన్నత విద్యను పూర్తి చేసి, తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో పాల్గొని ప్రతిభతో ఇన్‌కమ్ ట్యాక్స్ సూపరింటెండెంట్‌గా ఎంపికైంది. గిరిజన కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న పావని విజయం పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని గిరిజన విద్యార్థులు విద్యలో ముందుకు సాగి ఉన్నత లక్ష్యాలు సాధించాలని పెద్దలు సూచిస్తున్నారు.

Sthanikam

గ్రామీణ బాలిక నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పావని ప్రయాణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News