Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

గ్రామీణ మహిళల అభివృద్ధికి కీలక అడుగు – తుర్కపల్లిలో మహిళా సమైక్య భవన శ్రీకారం చుట్టిన: ఎమ్మెల్యే

05-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా మహిళా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.తెలంగాణ ప్రభుత్వం మహిళలను స్వయం ఆధారితంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి పది లక్షల రూపాయల నిధులను మంజూరు చేయగా,ఆ క్రమంలో తుర్కపల్లి గ్రామానికి కూడా ఈ అవకాశం లభించింది.ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధి లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యపడదని పేర్కొన్నారు.మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలపడితే కుటుంబంతో పాటు గ్రామం మొత్తం ముందుకు సాగుతుందని తెలిపారు.మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఈ భవనం కేంద్రంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.గ్రామంలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావాలని సూచించారు.శంకుస్థాపన అనంతరం శాసనసభ్యుడు తుర్కపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, అవసరమైన చోట మరింత మెరుగైన సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో తుర్కపల్లి గ్రామ సర్పంచ్ ప్రతాపరెడ్డి, ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మహిళల సంక్షేమం,గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ కార్యక్రమం స్పష్టమైన ఉదాహరణగా నిలిచిందని గ్రామస్తులు పేర

Sthanikam

గ్రామీణ మహిళల అభివృద్ధికి కీలక అడుగు – తుర్కపల్లిలో మహిళా సమైక్య భవన శ్రీకారం చుట్టిన: ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News