Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

గ్రామపంచాయతీ, శ్రీ శక్తి భవనాలకు భూ విరాళం చేసిన ;రైతు హుస్సేన్

18-02-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి: గ్రామపంచాయతీ భవనం తోపాటు స్త్రీ శక్తి భవన కార్యాలయాల నిర్మాణానికి సుమారు రూ.6లక్షల రూపాయల విలువ చేసే నాలుగు గుంటల స్థలాన్ని గ్రామానికి చెందిన లకావత్ హుస్సేన్ అనే రైతు దాతృత్వంతో అందజేశారు. బుధవారం మండల పరిధిలోని గుడి తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ గుగులోతు ఝాన్సీ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో గ్రామ అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతగా భావించి ఈ విలువైన స్థలాన్ని విరాళంగా ఇవ్వడం గ్రామస్తుల ప్రశంసలను అందుకున్నారు.

గ్రామంలో పంచాయతీ భవనం లేకపోవడంతో అంగన్వాడి భవనంలో కొనసాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రైతు హుస్సేన్ చేసిన ఈ మహాదానం గ్రామ చరిత్రలో నిలిచిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజాప్రయోజనాల కోసం ముందుకొచ్చిన రైతుకు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు రావాలని, స్థల దాత చేసిన ఈ సేవ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పట్ల రైతు చూపిన సేవాభావం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి చింత సురేష్, ఉప సర్పంచ్ గుగులోతు పద్మ, వార్డు సభ్యులు దారావత్ బుజ్జమ్మ, గుగులోతు శ్రీను, గుగులోతు సాగర్, గూగులోతు వినోద, పాతులోతు సరోజా, లకావత్ దామోదర్, లకావత్ భద్రమ్మ,గ్రామ పెద్దలు బానోతు వెంకన్న, గుగులోతు రమణ, పాతులోతు సూర్య, బానోతు భగవాన్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామపంచాయతీ, శ్రీ శక్తి భవనాలకు భూ విరాళం చేసిన ;రైతు హుస్సేన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News