Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:36 PM

గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం – చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

27-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఖేడ్ మండలం అబ్బేందా గ్రామంలో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ అంబికా కిరణ్ ఆహ్వానం మేరకు ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, తండాల అభివృద్ధికి మౌలిక వసతులు అత్యంత కీలకమని, ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీ వంటి సదుపాయాలు ప్రజల రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తాయని తెలిపారు. చేపట్టిన పనులు నాణ్యతతో పాటు సమయానికి పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచిస్తూ, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా బాధ్యతతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉందని, గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, ధర్మరెడ్డి, సంగప్ప, విజయకుమార్, స్వామి, శంకర్ గౌడ్, కాశీనాథ్, నర్సన్న, పాల విఠల్, మారుతి, రాజు, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం – చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఖేడ్ మండలం అబ్బేందా గ్రామంలో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ అంబికా కిరణ్ ఆహ్వానం మేరకు ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, తండాల అభివృద్ధికి మౌలిక వసతులు అత్యంత కీలకమని, ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీ వంటి సదుపాయాలు ప్రజల రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తాయని తెలిపారు. చేపట్టిన పనులు నాణ్యతతో పాటు సమయానికి పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచిస్తూ, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా బాధ్యతతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉందని, గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, ధర్మరెడ్డి, సంగప్ప, విజయకుమార్, స్వామి, శంకర్ గౌడ్, కాశీనాథ్, నర్సన్న, పాల విఠల్, మారుతి, రాజు, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News