Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 10:27 AM

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

23-02-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా

తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిర్వహించిన నిరసనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమాళ్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు బకాయి ఉన్నాయని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బహుళ విధుల విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని తెలిపారు.

అదేవిధంగా కార్మికులకు వేతనాలు ప్రత్యేక మార్గం ద్వారా నేరుగా చెల్లించే విధానం అమలు చేయాలని, పది లక్షల రూపాయల భీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News