Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

గ్రామ జీవనాధారమైన చెరువును కాపాడాలి – తహసిల్దార్‌కు వినతిపత్రం

02-02-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని పిచేర్యాగడి పాత తాండ గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్–100 నరసింహారెడ్డి చెరువుపై జరిగిన అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించి, చెరువును అసలు విస్తీర్ణంలో పునరుద్ధరించాలని తాండ సర్పంచ్ రామావత్ భీమి బాయి సోమవారం కోహిర్ తహసిల్దార్ సుప్రియకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామానికి జీవనాధారంగా ఉన్న నరసింహారెడ్డి చెరువు గతంలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండేదని, అయితే అక్రమ ఆక్రమణల కారణంగా ప్రస్తుతం దాని విస్తీర్ణం సుమారు 7 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. చెరువు విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల వర్షాకాలంలో సరైన నీటి నిల్వలు లేకపోతుండటంతో పాటు భూగర్భ జలాలపై, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామ ప్రజలకు తాగునీరు, సాగునీటి అవసరాలతో పాటు పశుపోషణకు ఎంతో కీలకమైన ఈ చెరువును కాపాడుకోవడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా సమగ్ర విచారణ చేపట్టి, చెరువుపై జరిగిన అన్ని అక్రమ ఆక్రమణలను పూర్తిగా తొలగించి, నరసింహారెడ్డి చెరువును అసలు విస్తీర్ణంలో పునరుద్ధరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్ పాల్గొని సర్పంచ్ వినతికి మద్దతు తెలిపారు.

Sthanikam

గ్రామ జీవనాధారమైన చెరువును కాపాడాలి – తహసిల్దార్‌కు వినతిపత్రం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News