Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:25 AM

గ్రామ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

09-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేట్ మండలంలోని చిలపల్లి గ్రామంలో నూతన మత్స్య పరిశ్రమిక సహకార సంఘాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన మరియు స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. చిలపల్లి గ్రామంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ఉండి మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, గ్రామ పెద్దలు మరియు యువత మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయాలని కోరడంతో ప్రత్యేక చొరవ తీసుకుని ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంఘం ద్వారా ప్రభుత్వ పథకాలు సులభంగా అందడంతో పాటు చేపల పెంపకం, మార్కెటింగ్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మత్స్యకారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి గ్రామ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి వర్గ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాల సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం గ్రామీణ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యకార సంఘ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News