Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:46 AM

గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో భూస మల్లయ్య

గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో భూస మల్లయ్య

గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో భూస మల్లయ్య
16-12-2025 451 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాసేవ కోసమే 20 ఏళ్ల రాజకీయ ప్రయాణం

ఆర్మూర్, స్థానికం ప్రతినిధి

లాభాపేక్ష లేకుండా గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నానని, గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ బరిలో నిలిచానని మంథని గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భూస మల్లయ్య తెలిపారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఆర్థిక నష్టాన్ని చవిచూసినా ప్రజాసేవకు వెనకడుగు వేయలేదని అన్నారు. పదవులు ఉన్నవారికే అవకాశాలు వస్తాయా..? సామాన్యుడికి అవకాశం లేదా..? అన్న ఆవేదన తనలో ఎన్నోసార్లు కలిగిందని, అయినా గ్రామానికి సేవ చేయాలన్న తపనతో ముందుకు వచ్చానని పేర్కొన్నారు.

గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ఏకైక లక్ష్యమని, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందిస్తానని హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే, గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని భూస మల్లయ్య ప్రజలను కోరారు.

Sthanikam

గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో భూస మల్లయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News