మెండే హనుమంతుకు నివాళులు
రామన్నపేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండలం మాజీ ఎంపీటీసీ–1గా పనిచేసిన గొరిగే నరసింహ ఆకస్మికంగా మృతిచెందడంతో ఆయన పార్థివ దేహాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అనంతరం చిట్యాల ఆంధ్రజ్యోతి ప్రతినిధి మెండే వెంకన్న తండ్రి మెండే హనుమంతు మృతిచెందడంతో ఆయన పార్థివ దేహానికి కూడా చిరుమర్తి లింగయ్య నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఈ కఠిన సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ రెండు సంఘటనలతో రామన్నపేట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి