Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:34 AM

గొరిగే నరసింహ మృతి హమాలీ ఉద్యమానికి తీరని లోటు: ఎండీ ఇమ్రాన్

04-01-2026 298 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మాజీ ఎంపీటీసీ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిగే నరసింహ మృతి హమాలీ సంఘానికి తీరని లోటని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ అన్నారు. ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన గొరిగే నరసింహ దశదిన కర్మలో సీపీఐ–ఏఐటీయూసీ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఎండీ ఇమ్రాన్ మాట్లాడుతూ, మధ్యతరగతి కుటుంబానికి చెందిన గొరిగే నరసింహ గత 30 సంవత్సరాలుగా సివిల్ సప్లై కార్పొరేషన్‌లో హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడంతో పాటు, హమాలీ సంఘ నాయకుడిగా అనేక ఉద్యమాలు, పోరాటాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. రామన్నపేటలో ఎంపీటీసీగా ప్రజాసేవ చేస్తూ అన్ని వర్గాల ఆదరణ పొందారని తెలిపారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బత్తుల సత్యం, ప్రధాన కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పాపగళ్ల శంకరయ్య, గొరిగే శంకరయ్య, పురుగుల రవి, స్వామి, అంజయ్య, పురుగుల శ్రీను, రవి, మహేష్, రమేష్, జీడయ్య, నగేష్, బాలరాజు, ఉప్పలయ్య తదితర హమాలీ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

గొరిగే నరసింహ మృతి హమాలీ ఉద్యమానికి తీరని లోటు: ఎండీ ఇమ్రాన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News