Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 02:53 AM

గొల్లగూడ పీఏసీఎస్ ఛైర్మన్‌కు ఘన సన్మానం

గొల్లగూడ పీఏసీఎస్ ఛైర్మన్‌కు ఘన సన్మానం

గొల్లగూడ పీఏసీఎస్ ఛైర్మన్‌కు ఘన సన్మానం
06-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్గొండ : గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆలకుంట్ల నాగరత్నం రాజుకు గురువారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఘనంగా సన్మానం జరిగింది. నల్గొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి పీఏసీఎస్ ఛైర్మన్ పాశం సంపత్ రెడ్డి, రాయినీగూడెం సర్పంచ్ బొంత రాములు ఆయనను శాలువా కప్పి, పూలమాలలతో గౌరవించారు.

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి..

​ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ జూకూరి రమేష్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్ ఛైర్మన్ల పదవీకాలాన్ని పొడిగించడం శుభపరిణామమని, ఇది పాలకవర్గాలపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో గొల్లగూడ పరిధిలోని రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో రైతులకు అగ్రపీఠం వేస్తోందని ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సహకార సంఘాలపై ఉందన్నారు. ప్రస్తుత సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఛైర్మన్‌ను కోరారు. ముఖ్యంగా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో సొమ్ము అందేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ కార్యాలయ సిబ్బంది, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

గొల్లగూడ పీఏసీఎస్ ఛైర్మన్‌కు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News