Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:31 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

20-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అట్టహాసంగా నిర్వహించాలి – మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు

స్థానికం ప్రతినిధి

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మెదక్ పోలీస్ పరేడ్ మైదానంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలు అట్టహాసంగా జరిగేలా చూడాలని సూచించారు. జిల్లాలో వివిధ వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉత్తమంగా విధులు నిర్వహించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపాలని, సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ పేర్లను సిఫారసు చేయాలని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక శాఖకు, అంబులెన్స్‌తో పాటు ప్రథమ చికిత్స సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు, మెదక్ ఆర్డీవో రమాదేవి సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News