Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

గాలిపటాలు ఎగరవేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి: మాజీ ఎంపీటీసీ సభ్యులు రవీందర్

Updated : 12 Jan 2026 14:36 IST
As Preferred Source 1 min read
గాలిపటాలు ఎగరవేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి: మాజీ ఎంపీటీసీ సభ్యులు రవీందర్

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువకులు, విద్యార్థులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో గాలిపటాలు ఎగరవేస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరూ గాలిపటాలు ఎగరవేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను.భవనాలపై, విద్యుత్ వైర్ల దగ్గర, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో గాలిపటాలు ఎగరవేయకూడదు. తెగిపోయిన గాలిపటాలను తీసుకోవడానికి పరిగెత్తుతూ వెళ్లి ప్రమాదాలకు గురికాకూడదు. ముఖ్యంగా చిన్నారులు గాలిపటాల వెనకాల పరిగెత్తకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి.గాలిపటాలు ఎగరవేసే సమయంలో పెద్దలు తప్పనిసరిగా పిల్లలను పర్యవేక్షించాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని అందరూ గుర్తుంచుకోవాలి. పండుగ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.అందరి సహకారంతో ఈ సంక్రాంతి పండుగను సంతోషంగా, ప్రమాదాల్లేకుండా జరుపుకుందాం అని మానూర్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రవీందర్ సూచించారు.

Sthanikam

గాలిపటాలు ఎగరవేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి: మాజీ ఎంపీటీసీ సభ్యులు రవీందర్

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువకులు, విద్యార్థులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో గాలిపటాలు ఎగరవేస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరూ గాలిపటాలు ఎగరవేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను.భవనాలపై, విద్యుత్ వైర్ల దగ్గర, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో గాలిపటాలు ఎగరవేయకూడదు. తెగిపోయిన గాలిపటాలను తీసుకోవడానికి పరిగెత్తుతూ వెళ్లి ప్రమాదాలకు గురికాకూడదు. ముఖ్యంగా చిన్నారులు గాలిపటాల వెనకాల పరిగెత్తకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి.గాలిపటాలు ఎగరవేసే సమయంలో పెద్దలు తప్పనిసరిగా పిల్లలను పర్యవేక్షించాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని అందరూ గుర్తుంచుకోవాలి. పండుగ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.అందరి సహకారంతో ఈ సంక్రాంతి పండుగను సంతోషంగా, ప్రమాదాల్లేకుండా జరుపుకుందాం అని మానూర్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రవీందర్ సూచించారు.

మరిన్ని

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news