Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:41 AM

గాలికుంటు టీకా “జిల్లా ప్రచార రథం “ ప్రారంభం

గాలికుంటు టీకా “జిల్లా ప్రచార రథం “ ప్రారంభం

గాలికుంటు టీకా “జిల్లా ప్రచార రథం “ ప్రారంభం
March 24, 2026 04:33 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

టీకా అమలుతో పాటు ,పరిపూర్ణ టీకా ప్రయోజనాలకు ప్రజల్లో అవగాహనా ప్రచారం అంత్యంత ముఖ్యం

- యెర్నేని కుసుమవెంకటరత్నం బాబు, కోదాడ మున్సిపల్ చైర్మన్

 కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాల నుండి గాలి కుంటు టీకా జిల్లా ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన కోదాడ మున్సిపల్ చైర్మన్ యెర్నేని కుసుమవెంకటరత్నం బాబు. అనంతరం మాట్లాడుతూ గాలికుంటు టీకా పై జిల్లా ప్రజలకు అవగాహన నిమిత్తం ఊరూరా తిరిగడానికి ఇలా ప్రచార రథం ఏర్పాటు చేయడం అత్యంత మంచి కార్యక్రమం అన్నారు. సాధారణంగా ఎంతో ఖర్చు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం కాని కొన్ని సార్లు వాటి గురించి ప్రజల్లో సమయానికి సరైన అవగాహన కల్పించడంలో విఫలమైతే అనుకున్న లక్ష్యాలను అందుకోలేమని అన్నారు. దేశంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి మహమ్మారిని సమూలంగా అంతరింపజేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహిస్తున్న గాలికుంటు టీకా కార్యక్రమం గ్రామ గ్రామాన పశుపోషకులకి మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ గాలికుంటు టీకా జిల్లా ప్రదాత రథం ఊరూరా తిరిగి ప్రచారం చేసి గాలికుంటు టీకా కార్యక్తమాన్ని విజయవంతం చేస్తుందని అన్నారు.

అనంతరం జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి డా బోడేపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గాలికుంటు టీకా ప్రచారం కోసం ఏర్పాటు చేసిన జిల్లా ప్రచార రథం ఈరోజు నుండి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తుంది అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి ఊరిలో ఉన్న అన్ని పశువులకు టీకాలు వేయించేలా ప్రచారం కోసం మైక్ ద్వారా సమాచారం చెప్పడం, టీకా కార్యక్రమాన్ని తెలియజేసే ఫ్లెక్స్ ప్రదర్శనతో నిర్దేశిత షెడ్యూలు ప్రకారం రథం జిల్లాలో పర్యటిస్తుంది అని, ఈ ప్రచార రథం కదలికలను జీపీఆర్ ఎస్ ద్వారా ప్రతీ రోజు మానిటరింగ్ చేయడం జరుగుతుంది అన్నారు.

కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిదులు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ,గ్రంథాలయ కమిటీ చైర్మన్ , కౌన్సిలర్ లు మరియు మున్సిపల్ కమిషనర్ లను తన సిబ్బందితో కలిసి పూల బోకేలతో సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలికిన స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ .

అనంతరం ప్రాంతీయ పశువైద్యశాలలో నిర్వహిస్తున్న, పశు ఔషధ బ్యాంక్ వివరాలు,ఔషధ దాతల వివరాలను అతిథులకు వివరించి, ఇక్కడ అందించే ఆర్థోపెడిక్, జనరల్, గైనక్, ఆప్తాల్మిక్, డెంటల్ తదితర ప్రత్యేక సర్జరీల కోసం జిల్లాలోని ఇతర మండలాలనుండే కాక పక్క జిల్లాలైన ఖమ్మం , నల్గొండ నుండి పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి పశుయజామనులు తమ పెంపుడు జంతువులను తీసుకు వస్తున్నారని పని వత్తిడి పెరిగినప్పటికీ మూగ జీవాల కోసం అదనపు సమయం వెచ్చించి వైద్యం అందిస్తూ చుట్టుపక్కల కోదాడ పట్టణం పేరు ప్రఖ్యాతులు విస్తరింప చేయడం జరుగుతుందని తెలుపుతూ , పురాతన భవనం కావడం, సరియైన వసతులు లేకపోవడం, ఆపరేషన్ థియేటర్ లేకపోవడం ల్యాబ్ మరియు స్కానింగ్ ఎక్స్ రే లేనందు వల్ల ఆరు బైటనే ఆపరేషన్లు చేయడం జరుగుతుందని అనువైన పక్కా భవనం నిర్మిస్తే మరింత మెరుగైన సేవలు అందించగలుగుతామని వివరించారు. స్పందించిన చైర్మన్ శాసన సభ్యులవారిద్వారా అవసరమైన నిధుల మంజూరుకి కృషి చేస్తామని అన్నారు.

కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, గ్రంథాలయాల చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య, మున్సిపాలిటీ 6 వ వార్డు కౌన్సిలర్ నాగేంద్రమ్మ, ప్రముఖ లాయరు కె యల్ ఎన్ ప్రసాద్ , సిబ్బంది రాజు చంద్రకళ , కర్ణ, సాగర్, రాజేష్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News