Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:36 PM

గాంధీనగర్‌లో ఘనంగా తల్లి ఎల్లమ్మ పండుగ

గాంధీనగర్‌లో ఘనంగా తల్లి ఎల్లమ్మ పండుగ

గాంధీనగర్‌లో ఘనంగా తల్లి ఎల్లమ్మ పండుగ
24-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం – భక్తులతో కలసి విందు స్వీకరణ

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు గాంధీనగర్‌లో భాదరబోయిన సుధాకర్ నివాసంలో తల్లి ఎల్లమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామీణ సాంప్రదాయాల మధ్య భక్తిశ్రద్ధలతో సాగిన ఈ వేడుకలో పాల్గొన్న నాయకులు కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక నాయకులు తల్లి ఎల్లమ్మ పండుగ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఇలాంటి పండుగలు కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయని, సంప్రదాయాలను తరతరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విందును స్వీకరించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు కస్పరాజు రమేష్, అర్ధాల మల్లేశ్వరరావు, బాలెమ్ల ఉప్పలయ్య, జెర్రిపోతుల సైదులు, మల్లెపాక బాబు, పోలేపాక సతీషు తదితరులు, స్థానిక కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

గాంధీనగర్‌లో ఘనంగా తల్లి ఎల్లమ్మ పండుగ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News