Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:44 AM

గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడి

24-12-2025 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి హామీ చట్టం రద్దును వ్యతిరేకించిన కెవిపిఎస్

స్థానికం ప్రతినిధి

మహాత్మా గాంధీ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ బిల్లు దేశ ప్రజలకు అవమానకరమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) తీవ్రంగా ఖండించింది.

ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సింలు డిమాండ్ చేశారు. కొత్త చట్టంలో ఉపాధికి హామీ లేకపోవడమే కాకుండా, నిధుల కేటాయింపులపై స్పష్టత లేకపోవడం ఆందోళనకరమని ఆయన విమర్శించారు. ఈ విధానం కోట్లాది ఉపాధి కూలీల జీవన హక్కును ప్రశ్నార్థకంగా మారుస్తోందని పేర్కొన్నారు.

గత రెండు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనాధారంగా నిలిచిన ఉపాధి హామీ చట్టం సామాజిక భద్రతకు ప్రతీకగా మారిందని తెలిపారు. అలాంటి చట్టాన్ని తొలగించి గాంధీ పేరును వ్యవస్థ నుంచి మాయం చేయడం వెనుక ప్రజావ్యతిరేక ఆలోచన దాగి ఉందని కెవిపిఎస్ నేతలు ఆరోపించారు.

గ్రామీణ పేదల జీవన భద్రతను కాపాడాలంటే ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, ప్రజల హక్కులను హరిస్తున్న కొత్త బిల్లును ఉపసంహరించుకోవాలని కెవిపిఎస్ స్పష్టం చేసింది.

Sthanikam

గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News