Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:44 AM

ఏవోకు అరుదైన గౌరవం – జాతీయ స్థాయి ఇఫ్కో శిక్షణకు ఎంపిక

11-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల వ్యవసాయ అధికారి (ఏవో) జక్కుల ఉదయ్‌కు అరుదైన గౌరవం దక్కింది. బెంగళూరులో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఇఫ్కో జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమానికి ఆయన ఎంపిక కావడం విశేషం. దేశవ్యాప్తంగా ఎంపికైన కొద్ది మంది వ్యవసాయ అధికారులతో కలిసి ఈ శిక్షణలో పాల్గొనే అవకాశాన్ని ఆయన సాధించారు.

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలను రైతులకు పరిచయం చేయడం లక్ష్యంగా ఈ శిక్షణను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక ఎరువుల వినియోగం, వాటి ప్రయోజనాలు, పంటల దిగుబడులను పెంచే విధానాలపై ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు.

ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసి, సాగు ఖర్చులను తగ్గిస్తూ అధిక దిగుబడులు సాధించేలా చేయడం ప్రధాన ఉద్దేశంగా ఉంది. రైతుల సంక్షేమం కోసం నూతన పద్ధతులను అమలు చేయడంలో ముందుండే ఉదయ్‌కు ఈ ఎంపిక రావడం పట్ల రైతులు, సహచర అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ జాతీయ స్థాయి గుర్తింపు పొందిన జక్కుల ఉదయ్‌కు పలువురు రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Sthanikam

ఏవోకు అరుదైన గౌరవం – జాతీయ స్థాయి ఇఫ్కో శిక్షణకు ఎంపిక

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News