Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

ఎస్‌టియు ‘చలో విజయవాడ’ సమరశంఖం పోస్టర్ ఆవిష్కరణ

23-02-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చిలకలూరిపేట : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న నిర్వహించనున్న “చలో విజయవాడ” కార్యక్రమానికి సంబంధించిన సమరశంఖం పోస్టర్‌ను చిలకలూరిపేట పట్టణంలోని ఎస్‌టియు ప్రాంతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్‌టియు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే.కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ పోరాటంలో వెనుకడుగు ఉండదని, ప్రభుత్వ మౌనం ఇక

సహించబోమని హెచ్చరించారు.

హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదు

ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆర్థిక బకాయిలకు పేస్‌స్లిప్‌లు జారీ చేసి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, మెమో నెం.57 ప్రకారం 2004 సెప్టెంబర్ 1లోపు నియామకమైన డీఎస్సీ-2003 ఉపాధ్యాయులు, పోలీసు మరియు ఇతర ఉద్యోగులకు పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.

ఉద్యోగ విరమణ చేసిన వారికి పెన్షన్ ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, ఉపాధ్యాయులపై బోధనేతర విధులు తొలగించాలని ఎస్‌టియు డిమాండ్ చేసింది.

స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ

ఫిబ్రవరి 25న జరిగే చలో విజయవాడ కార్యక్రమం అనంతరం కూడా ప్రభుత్వం స్పందించనిచో ఉపాధ్యాయ–ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌టియు పల్నాడు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బొంత రవి, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి వినుకొండ అక్కయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు విజయకుమార్, చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్లన జయప్రకాష్, మండల అధ్యక్షులు షేక్ మస్తాన్వలి, ప్రధాన కార్యదర్శి వడితే రమణనాయక్, అట్లూరి శ్రీనివాసరావు, సోమల నాయక్, ఎస్టి సీనియర్ నాయకులు చావల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్‌టియు ‘చలో విజయవాడ’ సమరశంఖం పోస్టర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News