Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:35 PM

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

26-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభం కానున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ,ఓటరు జాబితా సవరణలో అర్హత ఉన్న ప్రతి పౌరుని పేరు తప్పకుండా నమోదు కావడం అత్యంత ముఖ్యమని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితమైన జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో క్షేత్ర స్థాయి అధికారులు మరియు రాజకీయ పార్టీల తరపున నియమించే ప్రతినిధుల పాత్ర కీలకమని, అందువల్ల ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రతినిధులను ఈ నెల 30లోగా నియమించి వారి వివరాలను నియోజకవర్గాల వారీగా సమర్పించాలని కోరారు.ప్రతినిధుల నియామకం అనంతరం క్షేత్ర స్థాయి అధికారులతో కలిసి సమావేశాలు నిర్వహించి విధానాలపై పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ఎన్నికల విభాగపు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News