Sthanikam - Truth Matters
Logo

ఎస్‌బీఐ–ఆర్‌సేటి నల్గొండలో హౌస్ వైరింగ్ ఎలక్ట్రిషియన్ ఉచిత శిక్షణ

Updated : 21 Jan 2026 14:35 IST
As Preferred Source 1 min read
ఎస్‌బీఐ–ఆర్‌సేటి నల్గొండలో హౌస్ వైరింగ్ ఎలక్ట్రిషియన్ ఉచిత శిక్షణ

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (SBI–RSETI), నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన నిరుద్యోగ గ్రామీణ యువతకు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఎస్‌బీఐ–ఆర్‌సేటి డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ శిక్షణ 30 రోజులపాటు నిర్వహించబడుతుందని, శిక్షణార్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం స్వయం ఉపాధికి అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించడంతో పాటు బ్యాంకు అనుబంధ మార్గదర్శకత్వం కూడా ఉంటుందని తెలిపారు.

18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు 2026 జనవరి 25లోపు ఎస్‌బీఐ–ఆర్‌సేటి, రాంనగర్, నల్గొండ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం ఫోన్ నంబర్: 9701009265 ను సంప్రదించాలని తెలిపారు.

ఈ శిక్షణతో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

ఎస్‌బీఐ–ఆర్‌సేటి నల్గొండలో హౌస్ వైరింగ్ ఎలక్ట్రిషియన్ ఉచిత శిక్షణ

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి