Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

ఈఏపీసిఈటి లో శ్రీ గాయత్రి విద్యార్థుల ప్రతిభ

20-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్రస్థాయి ర్యాంకులతో మెరిసిన చౌటుప్పల్ కళాశాల విజేతలకు ఘన సన్మానం..

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టీజీ ఈఎపిసిఈటి -2026 ఫలితాల్లో చౌటుప్పల్‌లోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. బుధవారం కళాశాల ప్రాంగణంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఫలితాల్లో ఎం.లిఖిత 3101వ ర్యాంకు, డి.వైష్ణవి 6471వ ర్యాంకు, వి.తన్విజ 7332వ ర్యాంకు, ఎ.భాను 13754వ ర్యాంకు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. అదేవిధంగా 15 వేల నుంచి 25 వేల మధ్య సుమారు 30 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించగా, మొత్తం 100 మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించడం విశేషమని కళాశాల యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా కళాశాలల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. “చదువే జీవితాన్ని మార్చే శక్తి. సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు” అని విద్యార్థులకు సూచించారు.

కళాశాల కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్‌లో కళాశాల స్థాపించి పదేళ్లు పూర్తయ్యాయని, ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో వైద్యులు, ఇంజినీర్లు, అకౌంటెంట్లుగా స్థిరపడటం గర్వకారణమన్నారు. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య వల్లే ఐఐటీ, నీట్, ఎప్సెట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు.

విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి, మిఠాయిలు తినిపించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దయాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఈఏపీసిఈటి లో శ్రీ గాయత్రి విద్యార్థుల ప్రతిభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News