Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

ఏప్రిల్ 14 సభ విజయానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ప్రతి గ్రామం నుంచి హాజరు కావాలని పిలుపు

28-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 14న జరగనున్న భారీ సభకు సంబంధించిన పోస్టర్‌ను నాయకులుఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఏప్రిల్ 14న జరిగే సభకు మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి భారీగా కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను నెరవేర్చడం ప్రతి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్త బాధ్యత అని ఆయన అన్నారు. వచ్చే పది రోజుల్లో పార్టీ కోసం కృషి చేసే కార్యకర్తలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సూచించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీకాంత్ మాట్లాడుతూ, సభను విజయవంతం చేయడానికి సమన్వయం, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రభు కుమార్, జిల్లా ఇంచార్జి బొడ్డు కిరణ్, నల్గొండ జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు తగరం సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షుడు సుక్క రాములు, కోశాధికారి మాధ రమేష్, మండల ఉపాధ్యక్షుడు మస్కు ఉదయ్ కిరణ్, మున్సిపల్ అధ్యక్షుడు బాబు, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏప్రిల్ 14 సభ విజయానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ప్రతి గ్రామం నుంచి హాజరు కావాలని పిలుపు

Article Image

మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 14న జరగనున్న భారీ సభకు సంబంధించిన పోస్టర్‌ను నాయకులుఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఏప్రిల్ 14న జరిగే సభకు మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి భారీగా కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను నెరవేర్చడం ప్రతి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్త బాధ్యత అని ఆయన అన్నారు. వచ్చే పది రోజుల్లో పార్టీ కోసం కృషి చేసే కార్యకర్తలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సూచించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీకాంత్ మాట్లాడుతూ, సభను విజయవంతం చేయడానికి సమన్వయం, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రభు కుమార్, జిల్లా ఇంచార్జి బొడ్డు కిరణ్, నల్గొండ జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు తగరం సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షుడు సుక్క రాములు, కోశాధికారి మాధ రమేష్, మండల ఉపాధ్యక్షుడు మస్కు ఉదయ్ కిరణ్, మున్సిపల్ అధ్యక్షుడు బాబు, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News