Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:32 PM

ఈనెల 28న లోక్ అదాలత్ – ప్రజలకు సువర్ణావకాశం

24-03-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్సై చైతన్య కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఈనెల 28.03.2026 తేదీన నిర్వహించబడుతున్న జాతీయ లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు.ఈ లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంలో సులభంగా, త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ చలాన్లు, చిన్నపాటి క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, కుటుంబ సంబంధిత కేసులు వంటి అనేక అంశాలు పరస్పర ఒప్పందంతో తక్కువ సమయంలో పరిష్కారం పొందవచ్చని వివరించారు. దీర్ఘకాలంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు కూడా ఈ వేదిక ద్వారా త్వరగా ముగింపు పొందే అవకాశం ఉందన్నారు.ప్రజలు న్యాయవాదులు, పోలీస్ అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి తమ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా సమయం, ధనం ఆదా అవుతుందని, అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని తెలిపారు.అందువల్ల రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను సత్వర పరిష్కారం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఈనెల 28న లోక్ అదాలత్ – ప్రజలకు సువర్ణావకాశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News