Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:32 AM

ఈనెల 22న చెన్నైలో జరిగే ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయాలి"

20-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజా సంఘాల సమితి రాష్ట్ర నాయకులు బుగ్గ మైసయ్య

భువనగిరి టౌన్:ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, స్వేచ్ఛా,సమానత్వం చాలా ప్రధానమైన అవసరమని తెలంగాణ ప్రజా సంఘాల సమితి రాష్ట్ర నాయకులు బుగ్గ మైసయ్య అన్నారు. ప్రపంచ శాంతి కోరుతూ తమిళనాడు రాజధాని కేంద్రమైన చెన్నైలో ఈనెల 22వ తేదీన భారీ సమావేశం జరుగుతున్నదని, ఇట్టి సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధదేశాల ప్రతినిధులు హాజరు కానున్నారని అన్నారు. దీనికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర సమన్వయకర్త వలిగి ప్రభాకర్,ఎర్రగుంట శంకర్ నేతృత్వంలో ప్రజాస్వామిక వాదులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సభను గ్లోబల్ పీస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కె.ఎ.పాల్ సమన్వయంతో జరుగుతున్నదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలను ఆపాలని మరియు భారతదేశంలో శాంతి మరియు సమానత్వాన్ని ప్రోత్సహించాలని ప్రపంచాన్ని ఉద్దేశించి ఉపన్యాసాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు బట్టు రామచంద్రయ్య అధ్యక్షత వహించగా ప్రజా సంఘాల నాయకులు బర్రె సుదర్శన్,వడ్డేపల్లి దాసు, కొండమడుగు రాము,ఎస్ శివలింగం,గుండెబోయిన బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఈనెల 22న చెన్నైలో జరిగే ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయాలి"

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News