Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 02:41 AM

ఈనెల 19న జరిగే కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేద్దాం

08-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 19న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ నారాయణఖేడ్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి. అశోక్ మాట్లాడుతూ ఏప్రిల్ నెల మహనీయుల మాసమని, మహాత్మ జ్యోతిబాపూలే కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి విద్య ద్వారా సమాజ మార్పు కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని, అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితాంతం కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి భారత రాజ్యాంగాన్ని అందించి సమాన హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడని తెలిపారు. వారి స్ఫూర్తితో కుల రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి పని చేయాలని, సమాజంలో ఉన్న కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాల్లో మహనీయుల త్యాగాలు, పోరాటాలపై ఉపన్యాసాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కన్షీరాం, అర్జున్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సిములు, సహాయ కార్యదర్శి గణపతి, సీఐటీయూ ఏరియా కార్యదర్శి ఎన్. రమేష్, అలాగే సామాజిక ప్రజాసంఘాల నాయకులు రఘు, శీవనంద్, మోహన్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఈనెల 19న జరిగే కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేద్దాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News