Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి తోటలో గంజాయి సాగు బండారం – ఐదుగురు అరెస్ట్

24-02-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. చందర్లపాడు మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో మిర్చి తోట మధ్యలో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గుర్తించి ధ్వంసం చేశారు.

ఒక మహిళా రైతు ఆధ్వర్యంలో ఈ అక్రమ సాగు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. మిర్చి మొక్కల మధ్య దాచిపెట్టి పెంచిన గంజాయి మొక్కలను పూర్తిగా పీకివేసి, సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అక్రమ మాదకద్రవ్యాల సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

గ్రామంలో ఈ ఘటన కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sthanikam

ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి తోటలో గంజాయి సాగు బండారం – ఐదుగురు అరెస్ట్

Article Image

ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. చందర్లపాడు మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో మిర్చి తోట మధ్యలో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గుర్తించి ధ్వంసం చేశారు.

ఒక మహిళా రైతు ఆధ్వర్యంలో ఈ అక్రమ సాగు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. మిర్చి మొక్కల మధ్య దాచిపెట్టి పెంచిన గంజాయి మొక్కలను పూర్తిగా పీకివేసి, సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అక్రమ మాదకద్రవ్యాల సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

గ్రామంలో ఈ ఘటన కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News