Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:20 PM

ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం లోటుపాట్లు వద్దు పోలింగ్–కౌంటింగ్ పారదర్శకంగా జరగాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

09-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులకు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సదుపాయం, ర్యాంపులు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు వంటి ప్రత్యేక వర్గాల ఓటర్లకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో టేబుళ్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, సీసీ కెమెరాలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను మరింత పటిష్టం చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగాలన్నారు.అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం లోటుపాట్లు వద్దు పోలింగ్–కౌంటింగ్ పారదర్శకంగా జరగాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News