Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:51 AM

ఎన్నికల బందోబస్తులో అప్రమత్తత, క్రమశిక్షణ తప్పనిసరి

10-02-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఫిబ్రవరి 11న జిల్లాలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పోలీసు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని జిల్లా పోలీసు అధికారి నరసింహ సూచించారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించనున్న సిబ్బందికి పట్టణంలోని త్రివేణి ఫంక్షన్ హాలులో ఆయన మార్గనిర్దేశం చేశారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తి అంకితభావంతో బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన ప్రాంతాలను వదలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమబద్ధంగా నిలబెట్టాలని, అనుమతిలేని వ్యక్తులను కేంద్రాల పరిసరాల్లోకి రానివ్వకూడదని స్పష్టం చేశారు. వంద మీటర్ల పరిధిలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని, ఓటర్లు సెల్ ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువస్తున్నారా అనే విషయంపై నిఘా ఉంచాలని సూచించారు.

ఎన్నికల సామగ్రి తరలింపులో రూట్ మొబైల్ పోలీసు సిబ్బంది విధులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. పోలింగ్ సామగ్రిని పోలింగ్ బూత్‌లకు చేర్చడం, స్ట్రాంగ్ రూములకు తరలించడంలో పూర్తి భద్రత కల్పిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, గుంపులుగా చేరడం వంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.ప్రతి అధికారి, సిబ్బంది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, రామారావు, శివకుమార్, ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఎన్నికల బందోబస్తులో అప్రమత్తత, క్రమశిక్షణ తప్పనిసరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News