Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:38 AM

ఎన్నికల వేళ తుమ్మలగూడెంలో ఫ్లాగ్‌మార్చ్‌

ఎన్నికల వేళ తుమ్మలగూడెంలో ఫ్లాగ్‌మార్చ్‌

ఎన్నికల వేళ తుమ్మలగూడెంలో ఫ్లాగ్‌మార్చ్‌
13-12-2025 263 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజల్లో భద్రతాభావం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై డి. నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గ్రామ ప్రధాన వీధులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఎన్నికల నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై డి. నాగరాజు కోరారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Sthanikam

ఎన్నికల వేళ తుమ్మలగూడెంలో ఫ్లాగ్‌మార్చ్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News