Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:09 PM

ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాల పనులు ప్రారంభం

13-02-2026 537 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిదానపల్లి గ్రామానికి నలుదిక్కుల రహదారులు – జేసీబీలతో చెట్ల తొలగింపు

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఈసారి ఎన్నడూ లేనివిధంగా ఊపందుకున్నాయి.

భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో గ్రామానికి నలుదిక్కుల నుంచి రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. నిర్ణముల, బోగారం, ఇంద్రపాలనగరం వైపుల నుంచి వచ్చే మార్గాలను జేసీబీల సహాయంతో శుభ్రపరచి, రహదారుల ఇరువైపుల పెరిగిన చెట్లను తొలగించారు. గతంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ పనులు బ్రహ్మోత్సవాల సందర్భంగా వేగవంతం కావడం విశేషం.

గ్రామస్థుల సహకారంతో ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ ఆధ్వర్యంలో పనులు పర్యవేక్షిస్తున్నారు.డైరెక్టర్ కడారి మల్లేశం, అంగడయ్య, గ్రామ పెద్దలు నారపాక యాదయ్య, కొండ మల్లయ్య, కొండ శంకరయ్య, వర్కాల స్వామి, గ్రామపంచాయతీ సిబ్బంది వీరమల్ల వీరేశం తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు.

ఈసారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామంలో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ రహదారి పనులు గ్రామ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Sthanikam

ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాల పనులు ప్రారంభం

Article Image

మీ స్పందన? 8 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News