Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:12 AM

ఎన్‌జి కళాశాలలో AIపై అవగాహన.విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలపై దిశానిర్దేశం

16-05-2026 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్, : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నాగార్జున ప్రభుత్వ కళాశాలలో శనివారం కృత్రిమ మేధస్సు (AI)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతికతలపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.

సదస్సులో ప్రముఖ లీగల్ ప్రాక్టీషనర్ సిద్దేశ్వర్ రావు, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఎస్.పీ. వెంకటరమణ, టీఎస్‌కేసీ మెంటార్ ఎం.డి. తౌసిఫ్, ఆంగ్ల విభాగాధిపతి డా. వైవీఆర్ ప్రసన్నకుమార్ రిసోర్స్ పర్సన్లుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) ప్రస్తుత జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో డేటా సైన్స్‌కు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

హెల్త్‌కేర్‌లో వ్యాధుల గుర్తింపు, వ్యవసాయంలో దిగుబడుల పెంపులో AI సాంకేతికత వినియోగంపై నమూనాలను ప్రదర్శించారు. బోధన, అభ్యసన ప్రక్రియలను సులభతరం చేసే ఆధునిక AI టూల్స్‌పై ప్రత్యేకంగా వివరించారు.

ఈ ప్రదర్శనను విద్యార్థులు, అధ్యాపకులు ఆసక్తిగా సందర్శించి ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలను తిలకించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, అధ్యాపకులు జె. నాగరాజు, డా. వెల్దండి శ్రీధర్, కోటయ్య, డా. ఎ. మల్లేశం, లెఫ్టినెంట్ సుధాకర్, డా. అనిల్ బొజ్జ, డా. జ్యోత్స్న, డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి తదితరులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్‌జి కళాశాలలో AIపై అవగాహన.విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలపై దిశానిర్దేశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News