Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:22 AM

ఎన్‌జీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు

17-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో గత వారం రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “విద్యా వారోత్సవాలు–2026” ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి క్రీడాకారులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పతకాలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ, జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలు సభలో ఆకట్టుకున్నాయి. వారం రోజులుగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి కళాశాలకు పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ‘ఎడ్యుకేషన్ వీక్’ ద్వారా సాధించిన ఫలితాలను వివరించగా, డిప్యూటీ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు వారం రోజుల కార్యక్రమాల సమగ్ర నివేదికను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, అధ్యాపకులు డా. వెల్దండి శ్రీధర్, డా. ఆదె మల్లేశం, డా. అనిల్ బొజ్జ, ఎన్. కోటయ్య, శిరీష, వెంకటేశం, భాస్కర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్‌జీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News