Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:26 AM

ఎన్‌జీ కళాశాలలో మెగా మెడికల్ క్యాంప్ ఘనంగా పేరెంట్స్ మీట్‌, పూర్వ విద్యార్థుల సమ్మేళనం

14-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో గురువారం ఉచిత వైద్య శిబిరం, తల్లిదండ్రుల–అధ్యాపకుల సమావేశం, ప్రయోగశాలల సందర్శన, పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో డా. జయంత్, డా. శివాజి, డా. ఇమ్రాన్, డా. నౌషిన్ బృందం మధుమేహం, రక్తపోటు తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కళాశాలలో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

అనంతరం తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులకు కళాశాలలోని సైన్స్‌, కంప్యూటర్ ప్రయోగశాలలను సందర్శించే అవకాశం కల్పించారు. కళాశాలలోని ఆధునిక వసతులు చూసి వారు హర్షం వ్యక్తం చేశారు.

తల్లిదండ్రుల–అధ్యాపకుల సమావేశంలో విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ, పరీక్షల ఫలితాలపై అధ్యాపకులు తల్లిదండ్రులకు వివరించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.

కార్యక్రమంలో సమన్వయకర్త డా. పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, డా. డి. మునిస్వామి, డా. ఆదె మల్లేశం, డా. వెల్దండి శ్రీధర్, డా. భట్టు కిరీటం, డా. అనిల్ బొజ్జ, డా. ఎం. శ్రీనివాసరెడ్డి, లెఫ్టినెంట్ సుధాకర్, ఎన్. కోటయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్‌జీ కళాశాలలో మెగా మెడికల్ క్యాంప్ ఘనంగా పేరెంట్స్ మీట్‌, పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News