Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:43 PM

ఎన్జీ కళాశాలలో ఘనంగా రెడ్ రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ కన్వెన్షన్

ఎన్జీ కళాశాలలో ఘనంగా రెడ్ రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ కన్వెన్షన్

ఎన్జీ కళాశాలలో ఘనంగా రెడ్ రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ కన్వెన్షన్
December 30, 2025 04:43 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్జీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ కన్వెన్షన్

నల్లగొండ స్థానికం ప్రతినిధి

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో వన్ డే రెడ్ రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ కన్వెన్షన్ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న నేషనల్ యూత్ అవార్డు గ్రహీత డా. ఆకుల మధు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన, యువత పాత్ర, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై వివరించారు. యువత చైతన్యంతో ముందుకు వస్తేనే హెచ్‌ఐవీ నివారణ సాధ్యమని అన్నారు.

యన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, యువత ఆరోగ్య పరిరక్షణలో హెచ్‌ఐవీ నివారణనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. మరో రిసోర్స్ పర్సన్ భవాని మాట్లాడుతూ, హెచ్‌ఐవీ బాధితులకు సమాజం ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, రిసోర్స్ పర్సన్ లింగస్వామి, రెడ్ రిబ్బన్ క్లబ్ కన్వీనర్ డా. గంజి భాగ్యలక్ష్మి, యన్‌ఎస్‌ఎస్ యూనిట్ల ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎన్. కోటయ్య, ఎం. వెంకట్‌రెడ్డి, డా. అదే మల్లేశం, కంబాలపల్లి శివరాణి, మంద సావిత్రి, చైతన్య సుధ, పుష్పలతలతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది మరియు వివిధ కళాశాలల యన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News