Sthanikam - Truth Matters
Logo

ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఘాటైన విమర్శలు చేసిన చిరుమర్తి లింగయ్య

Updated : 04 Feb 2026 09:25 IST
As Preferred Source 1 min read
ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఘాటైన విమర్శలు చేసిన చిరుమర్తి లింగయ్య

చిట్యాల:

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశంపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బు సంచులు, గన్నులు పట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తిరుగుతున్నాడని ఆయన విమర్శించారు.

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన చిరుమర్తి లింగయ్య, ఓట్ల కోసం డబ్బు పంపిణీతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళలపై దాడులకు పాల్పడిన వ్యక్తి ఇప్పుడు ప్రజల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఓట్లు అడగడం విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలాంటి రాజకీయ సంస్కృతికి మహిళలు, ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని, భయం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Sthanikam

ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఘాటైన విమర్శలు చేసిన చిరుమర్తి లింగయ్య

Article Image

చిట్యాల:

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశంపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బు సంచులు, గన్నులు పట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తిరుగుతున్నాడని ఆయన విమర్శించారు.

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన చిరుమర్తి లింగయ్య, ఓట్ల కోసం డబ్బు పంపిణీతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళలపై దాడులకు పాల్పడిన వ్యక్తి ఇప్పుడు ప్రజల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఓట్లు అడగడం విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలాంటి రాజకీయ సంస్కృతికి మహిళలు, ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని, భయం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news