Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:33 AM

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మద్దతుతో భూషపాక అండాలు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా ప్రారంభం

01-02-2026 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజలే నా బలం, గెలుపే లక్ష్యంగా 32వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భూషపాక అండాలు ప్రసంగం

భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 32వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా భూషపాక అండాలుకు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి టికెట్ కేటాయించారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని స్థానిక తారక రామానగర్,32వ వార్డులో భూషపాక కొండల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,వార్డు ప్రజలతో కలిసి సుమారు రెండు వందల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం స్థానిక కమ్యూనిటీ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి భూషపాక అండాలు మాట్లాడారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకంతోనే ఈ అవకాశం లభించిందని తెలిపారు.అలాగే పోత్నక్ ప్రమోద్ కుమార్,తంగళ్ళపల్లి రవికుమార్,బర్రె జాంగిర్,గ్రంథాలయ చైర్మన్ అవైస్ చిస్తి సహకారంతో ఈ టికెట్ సాధ్యమైందని కృతజ్ఞతలు తెలిపారు.తాను గెలుపొందితే 32వ వార్డు సమగ్ర అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తానని,వార్డులోని ప్రతి సమస్యపై వెంటనే స్పందించి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని భూషపాక అండాలు హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పాటు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్ని రకాల అభివృద్ధి పనులకు పూర్తి మద్దతు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వార్డులోని ప్రజలంతా తనను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,32వ వార్డు కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు,మహిళలు,పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మద్దతుతో భూషపాక అండాలు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News