నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు పడింది. నారాయణఖేడ్ శాసనసభ్యులు డా. పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు మరియు రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలపై వివరంగా చర్చించారు. ముఖ్యంగా నల్లవాగు, బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరించి, ఈ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అంది రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ విషయాలపై మంత్రి సానుకూలంగా స్పందించి, ప్రాజెక్టుల పనులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీ నారాయణఖేడ్ ప్రాంత రైతులకు ఆశాజనకంగా మారి, వ్యవసాయాభివృద్ధికి దోహదపడనుందని స్థానికులు భావిస్తున్నారు.
PRINT TIME: August 31, 2026 12:30 PM
ఎమ్మెల్యే చొరవతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత

24-03-2026
68 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు పడింది. నారాయణఖేడ్ శాసనసభ్యులు డా. పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు మరియు రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలపై వివరంగా చర్చించారు. ముఖ్యంగా నల్లవాగు, బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరించి, ఈ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అంది రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ విషయాలపై మంత్రి సానుకూలంగా స్పందించి, ప్రాజెక్టుల పనులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీ నారాయణఖేడ్ ప్రాంత రైతులకు ఆశాజనకంగా మారి, వ్యవసాయాభివృద్ధికి దోహదపడనుందని స్థానికులు భావిస్తున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి