Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన వడాయిగూడెం సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్

16-03-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సర్వే నంబర్ 518 గల భూములకు సంబంధించిన సమస్యలపై వినతి

భువనగిరి మండల పరిధిలోని వడాయిగూడెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్ సోమవారం రోజు హైదరాబాద్‌లో శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్నని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని సర్వే నంబర్ 518 భూములకు సంబంధించిన వివాదాలపై ఆయనకు వినతి పత్రం సమర్పించారు.సర్వే నంబర్ 518లో కేవలం 20 ఎకరాల భూదాన్ భూమి ఉంటే,మొత్తం 467 ఎకరాలను నిషిద్ధ జాబితాలో పెట్టడం వల్ల రైతులు,సామాన్యులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి వివరించారు. జనావాసాలు ఉన్న ప్రాంతాలను కూడా బ్లాక్ చేయడం వల్ల ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని,దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సర్పంచ్ వివరించిన సమస్యను సావధానంగా విన్న తీన్మార్ మల్లన్న గారు స్పందిస్తూ.. భూభారతి లోపాలు మరియు రెవెన్యూ అధికారుల పొరపాట్ల వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడటం అన్యాయమని,ఈ విషయాన్నిఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుక్కల దుర్గయ్య యాదవ్,ఉమ రమేష్,కోట దీప,కోట సుధాకర్,కోట సుధావాణి,గ్రామ నాయకులు బబ్బూరి సాగర్ గౌడ్,రాసాల రాజు యాదవ్,బొజ్జ సాంబేష్,నీల మనీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన వడాయిగూడెం సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News