Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:10 PM

ఎమ్మార్వో ఖాళీ రైతుల కష్టాలు

ఎమ్మార్వో ఖాళీ రైతుల కష్టాలు

ఎమ్మార్వో ఖాళీ  రైతుల కష్టాలు
12-03-2026 219 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల ఎమ్మార్వో కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్లు గత రెండు రోజులుగా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయంలో రెగ్యులర్ ఎమ్మార్వో లేకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా స్థంభించింది.

గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎమ్మార్వోను తొలగించడంతో ఆయన స్థానంలో డిప్యూటీ ఎమ్మార్వోకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ డిప్యూటీ ఎమ్మార్వో ఫీల్డ్ వర్క్‌తో పాటు జనగణన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యాలయానికి రాకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

రిజిస్ట్రేషన్ల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు రోజులు గడిచినా పనులుజరగకపోవడంతో కార్యాలయంచుట్టూతిరుగుతున్నారు. అయినప్పటికీ రెవిన్యూ అధికారులు సమస్య పరిష్కారంపై పెద్దగా దృష్టి సారించకపోవడం రైతుల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది.

ఇక రేపు కూడా జనగణన శిక్షణ ఉండటం, ఆ తర్వాత రెండవ శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉండటంతో రిజిస్ట్రేషన్లు సోమవారం వరకు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డిప్యూటీ ఎమ్మార్వోలకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఉన్న కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిట్యాల కార్యాలయానికి రెగ్యులర్ ఎమ్మార్వోను నియమించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Sthanikam

ఎమ్మార్వో ఖాళీ రైతుల కష్టాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News