Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:27 PM

ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ సిబ్బంది

01-01-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: 2026 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని డిప్యూటీ తహశీల్దార్ రాజు పాటిల్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు ఆయన స్వగృహంలో ఎమ్మెల్యేను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.., నూతన సంవత్సరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కోరారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ ఈశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవ రెడ్డి,సర్వేయర్ మల్లేశం, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్,రాజు,దినకర్, రాజు, ఆపరేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ సిబ్బంది

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: 2026 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని డిప్యూటీ తహశీల్దార్ రాజు పాటిల్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు ఆయన స్వగృహంలో ఎమ్మెల్యేను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.., నూతన సంవత్సరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కోరారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ ఈశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవ రెడ్డి,సర్వేయర్ మల్లేశం, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్,రాజు,దినకర్, రాజు, ఆపరేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News