Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండు గంటల్లోనే వాహన దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:25 PM

ఎల్గూరి ఇందిర గెలుపు అభివృద్ధికి మలుపు

ఎల్గూరి ఇందిర గెలుపు అభివృద్ధికి మలుపు

ఎల్గూరి ఇందిర గెలుపు అభివృద్ధికి మలుపు
13-02-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పదకొండవ వార్డులో ప్రజల తీర్పుకు కృతజ్ఞతలు – మల్లు లక్ష్మి

సూర్యాపేట గ్రామీణం: మున్సిపాలిటీ ఎన్నికల్లో పదకొండవ వార్డు నుండి సిపిఎం, బిఆర్ఎస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించిన ఎల్గూరి ఇందిర గెలుపు అభివృద్ధికి మలుపు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పేర్కొన్నారు.శుక్రవారం ఎల్గూరి ఇందిరను పూలమాలతో ఘనంగా సన్మానించిన అనంతరం నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాయినిగూడెం ప్రాంత అభివృద్ధి ఎల్గూరి ఇందిరతోనే సాధ్యమని అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎల్గూరి ఇందిర గత నాలుగేళ్లుగా వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు.పేదలకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా సేవలందించారని, అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలిచారని కొనియాడారు. ప్రత్యర్థి అభ్యర్థి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు సేవాభావం ఉన్న అభ్యర్థిని గుర్తించి గెలిపించారని పేర్కొన్నారు. ఎల్గూరి ఇందిర విజయంలో భాగస్వాములైన రాయినిగూడెం పదకొండవ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, కొప్పుల రజిత, సిపిఎం నాయకులు మేకనబోయిన సైదమ్మ, మందడి రామిరెడ్డి, నల్ల మేకల అంజయ్య, కామల్ల లింగయ్య, నారాయణ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎల్గూరి ఇందిర గెలుపు అభివృద్ధికి మలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News