Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:41 AM

ఎల్బీనగర్ కాలనీలో సమస్యలకు పరిష్కారం

ఎల్బీనగర్ కాలనీలో సమస్యలకు పరిష్కారం

ఎల్బీనగర్ కాలనీలో సమస్యలకు పరిష్కారం
18-12-2025 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్ కాలనీలో సమస్యలకు పరిష్కారం

కాంగ్రెస్ నాయకుల చొరవతో అధికారుల తక్షణ చర్య

మల్కాజిగిరి, స్థానిక రిపోర్టర్

మల్కాజిగిరి నియోజకవర్గం 140వ డివిజన్ పరిధిలోని ఎల్బీనగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు కాంగ్రెస్ నాయకుల చొరవతో పరిష్కారం లభించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతన్న ఆదేశాల మేరకు కాలనీ సమస్యలను డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీడి సంపత్ కుమార్ గౌడ్ దృష్టికి కాలనీ వాసులు తీసుకువచ్చారు.

సమస్యలపై వెంటనే స్పందించిన సంపత్ కుమార్ గౌడ్ సంబంధిత ఎలక్ట్రికల్, మున్సిపల్ అధికారులను కాలనీలోకి పిలిపించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలింపజేశారు. అనంతరం విద్యుత్, పారిశుద్ధ్యం, మౌలిక వసతులకు సంబంధించిన అంశాలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోర శ్రీకాంత్ ముదిరాజ్, పార్థసారథి, మల్లేష్ గౌడ్, నరేష్, శ్రీశైలం ముదిరాజ్‌లతో పాటు కాలనీ వాసులు నరేందర్, పాల్ రాజ్, వీరేశ్, సతీష్, సంజీవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం స్పందిస్తూ పరిష్కార దిశగా ముందుకెళ్తోందని నేతలు పేర్కొన్నారు.

Sthanikam

ఎల్బీనగర్ కాలనీలో సమస్యలకు పరిష్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News