Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

ఏసీబీ వలలో విద్యాశాఖకు చెందిన లంచగొండి అధికారులు

21-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మదనపల్లె జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) అవినీతిపై ఏసీబీ మెరుపుదాడి - మదనపల్లె డీఈఓ కార్యాలయంలో కలకలం అన్నమయ్య జిల్లాలో అవినీతికి చెక్ పెట్టే దిశగా ఏసీబీ అధికారులు కీలక చర్యకు దిగారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన విద్యాశాఖలోనే లంచాల దందా బయటపడటం కలచివేసే విషయం. గుర్రంకొండ మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యజమాని నుంచి రూ.40,000 లంచం తీసుకుంటూ మదనపల్లె జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చెందిన ఏడి రాజశేఖర్ సీనియర్ అసిస్టెంట్ మున్నా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. స్కూల్ అనుమతులు, ఫైలుల కదలికల పేరుతో లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదుతో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. దీంతో డీఈఓ కార్యాలయం పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విద్య వ్యవస్థను వ్యాపారంగా మార్చి, చట్టాన్ని జేబులో పెట్టుకున్న అధికారులకు ఇదొక గట్టి హెచ్చరిక. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ ప్రజలనే దోచుకుంటే - ఇలానే బయటపడతారు! ఏసీబీ అధికారులు త్వరలోనే నిందితుల అరెస్టు వివరాలు లంచం డిమాండ్ చేసిన పూర్తి కారణాలు మరెవరైనా పాత్ర ఉందా?అన్న అంశాలను అధికారికంగా వెల్లడించనున్నారు.అవినీతిపై పోరాటం కొనసాగాలి విద్యా వ్యవస్థ పరిశుభ్రంగా ఉండాలి

Sthanikam

ఏసీబీ వలలో విద్యాశాఖకు చెందిన లంచగొండి అధికారులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News