Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:24 AM

ఏళ్ల నాటి రోడ్డు సమస్యకు తెర.. వెల్లంకి–గుండ్రంపల్లికి కొత్త రహదారి. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

04-01-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెల్లంకి–గుండ్రంపల్లి రోడ్డుకు మహర్దశ.. రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

రామన్నపేట స్థానిక ప్రతినిధి

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెల్లంకి–గుండ్రంపల్లి బీటీ రోడ్డు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవతో ఈ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రస్తుతం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. దీంతో స్థానికుల్లో హర్షం వెల్లివిరిసింది.వెల్లంకి నుంచి గుండ్రంపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం తో మాట్లాడి అవసరమైన నిధులను మంజూరు చేయించారు. అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించడంతో ప్రజలకు ఊరట లభించింది.

ప్రజల కష్టాలను గుర్తించి రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు వెల్లంకి మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యే ఎప్పుడూ ముందుంటారని, ఈ రోడ్డు నిర్మాణంతో వెల్లంకి గ్రామస్తుల రవాణా సమస్యలు శాశ్వతంగా తీరనున్నాయని పేర్కొన్నారు. పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

ఏళ్ల నాటి రోడ్డు సమస్యకు తెర.. వెల్లంకి–గుండ్రంపల్లికి కొత్త రహదారి. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News