Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

ఎండుతున్న పంటలు కాలువల్లో నే రైతుల నిరసన....

18-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పూర్తిస్థాయిలో సాగునీరు అందించి పంట పొలాలను కాపాడాలి

సాగునీరు అందక చివరి భూముల్లో పంట పొలాలు నిలువునా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, నల్లబండగూడెం,ద్వారకుంట, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆర్కే మేజర్ కాలువల్లో కి దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి వంతుల వారీగా నీరు విడుదల చేస్తున్నారని, అయితే ఆ నీరు చివరి ఆయకట్టు వరకు చేరడం లేదని వాపోయారు. మొన్నటి వరకు యూరియా కొరకు అనేక కష్టాలు పడి పంటలు పండిస్తే తీరా పంట చేతికి వచ్చే తరుణంలో ఎండిపోతుంటే దిక్కుతోచడం లేదని రైతులు వాపోయారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకువెళ్లినా తమను పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి తమ పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు గ్రామాల రైతులు జాల శ్రీనివాస్, జాల వెంకన్న, గోపి, తిరపయ్య, ముత్తయ్య, మహేష్, కార్తీక్, సోమయ్య, నగేష్, రాంబాబు, శంకర్, నాగేశ్వరరావు, వేణు, బిక్షం తదితరులు పాల్గొన్నారు....

Sthanikam

ఎండుతున్న పంటలు కాలువల్లో నే రైతుల నిరసన....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News