Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

14-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఈపీఎఫ్ ను రద్దుచేసి జిపిఎఫ్ గా మార్చాలని వినతి

సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపిన ప్రభుత్వ విప్ ఐలయ్య

యాదగిరిగుట్ట:ఈ.పి.ఎఫ్ నుండి జీపీఎఫ్ కు మార్పు విషయంలో 1999 నుండి 2003 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ,ప్రస్తుతం ఈ పి ఎఫ్ విధానంలో ఉండడం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.ముఖ్యంగా పదవీ విరమణ అనంతరం నిరంతర పెన్షన్ సౌకర్యం లేకపోవడం వల్ల కార్మికులు మరియు వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని వివరించారు. అలాగే వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వైద్య ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెన్షన్ అనేది ప్రతి ఉద్యోగికి ఉండాల్సిన హక్కు అని కార్మికులు తెలిపారు.1999 నుండి 2003 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులను ఈ పి ఎఫ్ విధానం నుండి జీపీఎఫ్ విధానానికి మార్చి, వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ అంశాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ని విజ్ఞప్తి చేశారు.ఈ సమస్యను ఎమ్మెల్యే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం వద్ద ప్రస్తావించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 1104 జిల్లా అధ్యక్షులు పడిగం యాదగిరి,మీర్జా షకీల్ బేగ్, టి.రమేష్ రెడ్డి,బొట్ల రాజేశ్వర్,గుమ్మడి ఆంజనేయులు,బండపల్లి ఆంజనేయులు,బాబురావు, నానచర్ల నరసింహ,రాజమల్లయ్య,సత్తయ్య,ఉప్పలయ్య,కే.శ్రీనివాస్,విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News