Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

10-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు,చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా భువనగిరి విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే,జ్యోతి రావు పూలే మహనీయుల విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మహిళల విద్యాభివృద్ధి కోసం జీవితాంతం పోరాడి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా వెనుకడుగు వేయని మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు.స్త్రీల విద్య, సమాజంలో సమానత్వం కోసం కృషి చేసిన ఆమె సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఆడపిల్లల చదువు కోసం ఎన్నో ఇబ్బందులు,దాడులు ఎదుర్కొంటూ కూడా తన భర్త జ్యోతి రావు పూలే ఆశయ సాధనలో అంకితభావంతో నడిచిన గొప్ప సహచరధర్మచారి అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నాగేష్,ఎస్‌ఏఓ హరీష్ కుమార్,విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కంపెనీ కార్యదర్శి బొబ్బిలి మురళి,డివిజన్ అధ్యక్షులు రేసు శ్రీనివాస్,కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్ సిద్ధి లింగం,డివిజన్ ప్రధాన కార్యదర్శి ర్యాకల బాల నరసింహ,డివిజన్ లీడర్ బత్తిని కిరణ్ కుమార్,విద్యుత్ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News