విద్యుత్ బస్సులు ఆర్టీసీకే: కార్మిక సంఘాల ఐక్య డిమాండ్!
విద్యుత్ బస్సులు ఆర్టీసీకే: కార్మిక సంఘాల ఐక్య డిమాండ్!
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
ఆర్టీసీ రక్షణకు ఐక్య పోరాటం: విద్యుత్ బస్సులు ఆర్టీసీకే!
నల్గొండ,: కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్ విధానంలో మార్పులు చేసి వాటిని ఆర్టీసీలకుకేటాయించాలని, 2021, 2025 వేతన సవరణలు అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. "ఆర్టీసీ రక్షణ - కార్మికుల హక్కుల పరిరక్షణ" కోసం అన్ని సంఘాలుఐక్యంగా ఉద్యమించాలని సిఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు.
సిఐటియూరాష్ట్ర కమిటీ పిలుపున ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం లైబ్రరీ హాల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వీరారెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ బస్ కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్‌లను ఆర్టీసీలకు అప్పగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఉద్యోగ భద్రత కోసం కృషి చేయకుండా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఈ విధానం కొనసాగితే ఆర్టీసీలమనుగడ కష్టమవుతుందని, కార్మికులకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
బహుజనకమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. పర్వతాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగునాగార్జున, వేదిక రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రకార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆర్టీసీలను ప్రైవేటు కార్పొరేట్లకు అప్పగించడం తప్పుపడిందని మండిపడ్డారు. దేశంలో 42 కోట్ల వాహనాల్లో ఆర్టీసీ బస్సులు 1.4 లక్షలు మాత్రమేనని, నీతి ఆయోగ్ లెక్కలు ఆధారంగా కార్బన్ ఉద్గారాలు తగ్గించాలంటే ప్రజా రవాణాన్నిపెంచాలని వాదించారు.
కార్మికులు 2017 వేతనాలు తీసుకుంటున్నారని, 2021, 2025 సవరణలు జరపాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం వల్ల పని భారం పెరిగిందని, యూనియన్ల పునర్నోదాసరణ మూటలుగానే మిగిలాయని విమర్శించారు. ప్రభుత్వ హామీలు అమలు చేయకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఆర్టీసీఎస్‌డబ్ల్యూ ఎఫ్ నల్గొండ డిపో గౌరవాధ్యక్షుడు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, నూతన టెక్నాలజీని ఆహ్వానిస్తున్నామని, కానీ అది ఉపాధిని పెంచేదిగా ఉండాలని చెప్పారు. విద్యుత్ బస్సుల స్కీమ్ ప్రైవేటు పెట్టుబడిదారులకు లాభాలు గ్యారెంటీ చేస్తోందని, ప్రజా రవాణా సంస్థలను అప్పగించడాన్ని వ్యతిరేకిస్తామని తెలిపారు.
సమన్వయకర్తగాసిఐటియూ పట్టణ కన్వీనర్ అవుట రవీందర్ నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బండ శ్రీశైలం, ఎస్‌డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి కె.ఎస్. రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కె.శాంసుందర్, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లాకార్యదర్శి శ్యాంసుందర్, ఐఎఫ్‌టియూ జిల్లా అధ్యక్షుడు బొంగురాల నరసింహ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, టి.ఎం.ఎస్.ఆర్.వై. నల్గొండబ్రాంచ్ అధ్యక్షుడు స్వామి, ఎల్ఐసి ఏఓవై డివిజన్ కార్యదర్శి నలపరాజు సైదులు, డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి గుండాల నరేష్, సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు లకపాక రాజు, మధ్యాహ్న భోజనం వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ, మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జింజరాల శ్రీనివాస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింతకాయల సంతోష్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ నాయకుడు అద్దంకి నరసింహ, శ్రామిక మహిళ నాయకురాలు సిహెచ్ అనురాధ, మిరియాల శ్రీవాణి పాల్గొన్నారు.
సమావేశంఆర్టీసీ పరిరక్షణకు కొత్త ఊపిరి పోసింది. ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాపాడాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం తప్పనిసరి అని నాయకులు ఐక్యత ప్రకటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి