Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:44 PM

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు పిలుపు

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు పిలుపు

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు పిలుపు
April 06, 2026 07:28 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఏడో తేదీ చలో వరంగల్ – ఎనిమిదో తేదీ నుండి సమ్మె ప్రారంభం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉపకేంద్రంలో ఆర్టిజన్ కార్మికుల సమ్మె పోస్టర్‌ను ట్రాన్స్కో సూర్యాపేట వలయాధ్యక్షుడు బోనాల శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ నాయకులు బండి నరేష్, రవి, సుధాకర్, రామారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బోనాల శ్రీధర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది ఆర్టిజన్ కార్మికులకు అర్హతలకు అనుగుణంగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంయుక్త చర్య సమితి పిలుపు మేరకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ సంయుక్త చర్య సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఏడో తేదీన వరంగల్‌లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల మంది ఆర్టిజన్ కార్మికులు వరంగల్‌లోని ఉత్తర విద్యుత్ పంపిణీ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే ఎనిమిదో తేదీ ఉదయం 9 గంటల నుండి దాదాపు 19 వేల మంది ఆర్టిజన్ కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News