Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:24 AM

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి

16-05-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ పాఠశాలల సదుపాయాలు వినియోగించుకోవాలి.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన “విద్య విజయోత్సవం–2025–26” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల జీవితంలో తొలి మెట్టు అని, ఇక్కడితో ఆగకుండా మరింత కష్టపడి చదివితే భవిష్యత్తులో గౌరవప్రదమైన స్థాయికి చేరుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలకు విద్యార్థుల ఉత్తీర్ణత ఫలితాలే నిదర్శనమన్నారు.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 98.30 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యారంగంలో మార్పు కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.

ప్రభుత్వ విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, షూలు, పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. జూన్ 2 నుంచి అల్పాహారం కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

అనంతరం పదో తరగతి, ఇంటర్మీడియట్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో ప్రతిభ కనబరిచిన 9 మంది విద్యార్థులకు రూ.10 వేల నగదు పురస్కారాలు అందజేసి సన్మానించారు. మండల స్థాయిలో ఎంపికైన 51 మంది టాపర్ విద్యార్థులను కూడా శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, ఉపాధి కల్పన అధికారి సాహితి, టీజీవో అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News